Monday, 10 September 2012

సుడిగాడిని బీట్ చేసిన ‘శిరిడి సాయి’


Evolution Cocktail
Ads by Google
Buy Villas In Bangalore Centuryrealestate.in/WintersunVilla
Century Wintersun Luxury Villas in Yelahanka,B'lore @ 1.4 Cr.Book Now!
హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘శిరిడి సాయి' చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన అల్లరి నరేష్ తాజా చిత్రం ‘సుడిగాడు' ఓపెనింగ్స్‌తో పోల్చితే ‘శిరిడి సాయి' చిత్రం దాన్ని అధిగమించింది.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ భక్తిరస చిత్రం అమెరికాలో బుధవారం(సెప్టెంబర్ 5)న విడుదలైంది. తొలుత పరిమితమైన స్ర్కీన్లలో విడుదలైన ఈ చిత్రానికి తొలి రెండు రోజుల్లో పూర్ కలెక్షన్లు వచ్చాయి. నాగార్జున సాయిబాబా రూపంలో నటించిన మూవీకి బుధ, గురువారాల్లో రూ 12,80,699 ($23,140) కలెక్షన్ మాత్రమే వచ్చింది.
సినిమా మంచి టాక్ రావడంతో శుక్రవారం స్క్రీన్ల సంఖ్య పెంచారు. దీంతో వీకెండ్ రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. 100% శాతం గ్రోత్ సాధించి డబల్ కలెక్షన్లు రాబట్టింది. శనివారం ఈ చిత్రం రూ. 31,33,610 ($56,646) కలక్షన్లు సాధించింది.
మొత్తానికి శిరిడి సాయి చిత్రం తొలి నాలుగు రోజుల్లో రూ. 63,04,476 వసూళ్లు సాధించింది. ఆదివారం కలెక్షన్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ట్రేడ్ విశ్లేషకులు మాత్రం శనివారం వచ్చిన వసూళ్ల కంటే ఆదివారం వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. సుడిగాడు ఓపెనింగ్ వీకెండ్ రూ. 69.83 లక్షలు. ఈ లెక్క ప్రకారం ‘శిరిడి సాయి' వీకెండ్ కలెక్షన్లు సుడిగాడు చిత్రాన్ని అధిగమిస్తాయి అంటున్నారు. ఆదివారం కలెక్షన్ల వివరాలు వెల్లడయ్యాక అది యూఎస్ తెలుగు సినిమా మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
గతంలో నాగ్-రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. తాజాగా ‘శిరిడి సాయి' చిత్రంతో హాట్రిక్ కొట్టారు. ఇక సినిమాకు కీరవాణి అందించిన సంగీతం, బ్యాంగ్రౌండ్ స్కోర్ మరింత వన్నె తెచ్చాయి.Nagarjuna S Shirdi Sai Beats Sudigagu Record At Usa



No comments:

Post a Comment