Monday, 10 September 2012

రామ్ చరణ్ సినిమాకు ప్లాప్ టాక్!


Ads by Google
BharatMatrimony.com bharatmatrimony.com/join-free-now
The most trusted matrimony service With exclusive regional portals.
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘చిరుత' చిత్రం తెలుగులో మంచి విజయం సాధించిన విషయంతో తెలిసిందే. చిరంజీవి నట వారసుడిగా చరణ్ తెర్రగేటం చేసిన ఈచిత్రానికి మెగా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. మొత్తానికి చరణ్ ఎంట్రీ ఈ చిత్రం ద్వారా సక్సెస్ పుల్ అయింది.
తెలుగు వచ్చిన ఫలితాలే తమిళంలో వస్తాయనే ఆశతో అక్కడ ‘చిరుత్తై పులి' పేరుతో ఈచిత్రాన్ని తాజాగా తమిళనాడులో విడుదల చేసారు. మొత్తం 19 స్క్రీన్లలో అక్కడ విడుదలైన ‘చిరుత్తై పులి' చిత్రం బ్యాడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక్కడ చిత్రానికి అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది.
అయితే రామ్ చరణ్ గతంలో నటించిన మగధీర చిత్రం ‘మావీరన్'గా , రచ్చ చిత్రం ‘రగలై'గా విడుదలై మంచి మంచి టాకే తెచ్చుకున్నప్పటికీ...... చిరుత తమిళ వెర్షన్ మాత్రం బోల్తా పడింది. అందుకు కారణం రామ్ చరణ్ మగధీర, రచ్చ చిత్రాల రేంజిలో ఆచిత్రం లేక పోవడమే.
ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఎవడు' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ని వైజాగ్‌లో ప్లాన్‌ చేశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అల్లు అర్జున్‌ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు.
రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు బాలీవుడ్ మూవీ జంజీర్ చేస్తున్న విషయం తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తోంది. ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ దర్శకత్వంలో ‘నాయక్' చిత్రంలోనూ రామ్ చరణ్ నటిస్తున్నాు. ఈ మూడు చిత్రాలూ మాస్ ని టార్గెట్ చేసినవే కావటం విశేషం. ఆరెంజ్ ప్లాప్ కావటంతో రామ్ చరణ్ పూర్తిగా తన తండ్రి నటించిన సూపర్ హిట్స్ తరహా పాత్రలనే ఎంచుకోవటానికే ఆసక్తి చూపుతున్నారు.

No comments:

Post a Comment