రీ ఎంట్రీతో మళ్లీ బిజీ హీరోయిన్ అయిన నయనతార దర్శక నిర్మాతలకు తాజాగా రెండు నిబంధనలు విధిస్తోందట.
రీ ఎంట్రీతో మళ్లీ బిజీ హీరోయిన్ అయిన నయనతార దర్శక నిర్మాతలకు తాజాగా రెండు నిబంధనలు విధిస్తోందట. ఇంతకుముందు గ్లామరస్ పాత్రలకు ప్రాముఖ్యత నిచ్చిన ఈ సంచలన తార ఈత దుస్తులు ధరించడానికి కూడా వెనుకాడలేదు. బిల్లా చిత్రంలో అజిత్ సరసన ఈత దుస్తులతో నటించి కుర్రకారుకు మతి పోగొట్టింది. గజని చిత్రంలో అంగాంగ ప్రదర్శన చేసి గుండెల్లో గుబులు పుట్టించింది. ఆ తరువాత నృత్య దర్శకుడు, నటుడు ప్రభుదేవా ప్రేమలో పడడం అది పెళ్లికి దారి తీయడంతో నటనకు స్వస్తి చెప్పింది. రెండేళ్లకు పైగా సాగిన ప్రభుదేవా నయనతార ప్రేమ పెళ్లి వరకు వెళ్లి పెటాకులు కావడంతో అమ్మడు మళ్లీ నటనపై దృష్టి సారిం చింది.
ప్రస్తుతం తమిళంలో అజిత్ సరసన ఒక చిత్రం, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రం లోనూ, తెలుగులో మూడు చిత్రా ల్లో నటిస్తోంది. అనూహ్యంగా అవకాశాలు వెల్లువెత్తడంతో ఈ కేరళ కుట్టి దర్శక నిర్మాతలకు నిబంధనలు విధిస్తోందట. ముఖ్యంగా హద్దులు మీరి అందాలు ప్రదర్శించనని, హీరోలతో సన్నిహితంగా నటించనని షరతులు పెట్టిందట. ఈ కండీషన్‌కు ఒప్పుకుంటేనే తన కాల్‌షీట్స్ కోసం రండి అని అంటోందని కోడంబాక్కం టాక్.

No comments:
Post a Comment